జోగులాంబ గద్వాల : గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం(ATM) చోరీకి ప్రయత్నించి విఫలమైన సంఘటన జోగుళాంబ గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. గద్వాల టౌన్ ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లోకి గురువారం తెల్లవారుజామున దుండగులు చొరబడ్డారు.
మిషన్ను ధ్వంసం చేసి నగదు అపహరణకు విఫలయత్నం చేశారు. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో చివరకు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఉదయం సమాచారం అందుకున్న ఎస్సై ఏటీఎంను పరిశీలించారు. బ్యాంక్ నిర్వాహకులతో మాట్లాడగా.. నగదు చోరీకి గురికాలేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.