Tragedy | నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లి శివారులోని పొలంలో గల నీటి గుంటలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు. మృతులను సిరి (13), స్నేహ (13), శ్రీమన్యు(11)గా గుర్తించారు. చిన్నారులు ముచ్చర్లపల్లిలో ఉండే నానమ్మను చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.