నల్లగొండ : రాష్ట్రంలోని గరుకుల పాఠశాలల్లో రోజురోజుకు సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. మొన్న గురుకుల ప్రాంగణంలో పాముకాటుకు గురై ఓ విద్యార్థి మృతి చెందాడు. నిన్నటికి నిన్న పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని తుమ్మడం గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కొద్ది రోజులుగా ఏదో ఒక చోట విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మైనారిటీ గురుకుల పాఠశాలలో(Minority Gurukula School) ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్(Students missing) అవ్వడం కలకలం రేపుతున్నది. నిన్నటి నుంచి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో పిల్లల తల్లితండ్రులు, పాఠశాల సిబ్బంది ఆందోళనలో చెందుతున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | కంప్యూటర్లను కనిపెట్టడంలో రేవంత్ రెడ్డి బిజీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
Breast Cancer | ‘రొమ్ము క్యాన్సర్’ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ.. వేల మరణాలను ఆపుతున్న అంధులు
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్