Ganja | విద్యా సంస్థలే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
Ganja | గంజాయి(Ganja) విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి : విద్యాసంస్థల పరిసర ప్రాంతాలు, వలస కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని గంజాయి(Ganja) విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2లక్షల 15వేల విలువ చేసే 6.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు.
బాచుపల్లి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఒడిషాకు చెందిన రోహిత్ మచ్చ(19), కూకట్పల్లి ప్రకాశ్‌నగర్‌కు చెందిన బోగి దుర్గాప్రసాద్(21),బొల్లారంలోని యాప్రాల్‌లో నివాసం ఉంటున్న కౌకూర్‌కు చెందిన పర్దేం ఒమేశ్ అనే వ్యక్తులు విద్యాసంస్థల పరిసర ప్రాంతాలను ఎంపిక చేసుకుని గత కొంత కాలంగా గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటీ పోలీసులు మంగళవారం రాత్రి నిజాంపేట్‌లోని ఓ కళాశాల రోడ్డులో ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా రెడ్‌హ్యాండేడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 6.4కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

