రాజన్న సిరిసిల్ల/కడ్తాల్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాతపడ్డారు. తంగళ్లపల్లి మండలం భరత్‌నగర్‌కు చెందిన రామడుగు చంద్రయ్య(42) పొలం పనులు చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్‌పల్లికి చెందిన కంబాల శ్రీనివాస్(40) గురువారం చింతకాయలు తెంపేందుకు వెళ్లాడు. చెట్టు కింద శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు ఉండగా పిడుగుపడింది.
శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన పసునూరి ప్రవీణాచారి (30) కార్పెంటర్. గురువారం మామ జంగయ్యాచారితో కలిసి బైక్‌పై కడ్తాల్ వెళ్లి వస్తూ వాన రావడంతో వాసుదేవ్పూర్ గేట్ బస్‌షెల్టర్ వద్ద ఆగారు. ఇదే సమయంలో పిడుగుపడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
జంగయ్యకు ఎలాంటి గాయాలూ కాలేదు. కానీ బస్సు షెల్టర్ ఎదుట నిలబడిన మాడ్గుల్‌కు చెందిన గౌని నిరంజన్గౌడ్కి తీవ్రగాయాలయ్యాయి. అతడిని పోలీసులు కల్వకుర్తి ప్రభుత్వ దవఖానకు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కి తరలించారు. మరో ఘటనలో మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారంలో జెల్ల యాదగిరి అనే రైతుకు చెందిన ఆవుపై పిడుగు పడి అవు అక్కడిక్కడే మృతి చెందింది.