హైదరాబాద్ : భవన నిర్మాణానికి లంచం(Bribe) డిమాండ్ చేస్తూ పట్టుబడిన నీటిపారుదల శాఖకు చెందిన ముగ్గురు ఇంజినీర్లు, సర్వేయర్‌ను(Engineers) ఏసీబీ(ACB) అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా(Rangareddy Dist) నెక్నాంపూర్లో భవన నిర్మాణానికి ఎల్వోసీ కోసం ఓ వ్యక్తి నుంచి లచం డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి నుంచి రూ.2.50 లక్షలకు అధికారులు ఒప్పందం చేసుకున్నారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ముందుగా ఒప్పందం మేరకు 1.50 లక్షలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భన్సీలాల్, అసిస్టెంట్ ఇంజినీర్స్ కార్తీక్, నిఖేష్‌కుమార్‌తో పాటు సర్వేయర్ గణేష్‌ను అరెస్ట్ చేశారు.