నారాయణపేట: నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని మక్తల్ (Makthal) మండలం బొందలకుంట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం డీసీఎంను (DCM) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం గురించి తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.