హైదరాబాద్: మేడ్చల్‌లో (Medchal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొందరపాటు, మితిమీరిని వేగానికి ముగ్గురు బలయ్యారు. మేడ్చల్ సమీపంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బైకు ముందుగా వెళ్తున్న లారీని వోవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పింది. దీంతో అది లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులతో పాటు మరో యువతి అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రమాద కారణంగా జాతీయ రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పోసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.