వరంగల్: జిల్లా బొల్లికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మరణించిన వారిని వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.