Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ‘ఇప్పుడు ఆలోచన చేసి.. ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే.. తెలంగాణను మళ్లీ కుక్కలు చింపిన విస్తరి చేస్తరు. శాంతిభద్రతలు అదుపు తప్పుతయి. రౌడీ మూఖలు రాజ్యమేలుతయి. హత్యలు పెరుగుతయి’ అని నాడు ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షరసత్యంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పదినెలల పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పడమే కాకుండా రాజకీయ ప్రేరేపిత హత్యలు తెలంగాణలో తొలిసారిగా నమోదవడం కలకలం సృష్టిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలలు కాగా ఏడాదిలోనే ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలను దారుణంగా చంపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్ నుంచే రాజకీయ హత్యలు మొదలయ్యాయి. కొన్నేండ్ల పాటు దేశానికి జవాన్‌గా సేవ చేసి, బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించిన కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లికి చెందిన మల్లేశ్ యాదవ్‌ను 2023, డిసెంబర్ 28న దారుణంగా పొడిచి చంపారు. మల్లేశ్‌యాదవ్ హత్యను మరువక ముందే 2024, మే 23న అదే జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డిని అర్ధరాత్రి 12 గంటల తర్వాత కరెంటు తీసేసి మరీ గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. 10 నెలలై నా ఈ హత్యకు కారకులెవరో తేల్చలేదు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోలీసులకు వి న్నవించినా తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో భూ వివాదాల ముసుగులో అధికార కాంగ్రెస్ నాయకులు ఈర్యా నాయక్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారు. ఈ ఘటన నిరుడు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజున జరిగింది. శివాయిగూడేనికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తేజావత్ హతీరాం.. కోయచలక రెవెన్యూ పరిధిలోని తన ఎకరం అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన లాల్‌సింగ్ (బీఆర్ఎస్ కార్యకర్త)కు విక్రయించాడు. అసైన్డ్ భూమి కావడంతో తాను అమ్మిన భూమిని తిరిగి ఆక్రమించుకోవాలని హతీరాం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య బాలాజీని ఆశ్రయించాడు. దీనిపై బాలాజీ చర్చలకు తమ ఇంటికి రావాలని లా ల్సింగ్ను ఆదేశించాడు. తనకు అన్యాయం జరుగుతున్నదని భావించిన లాల్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లాల్‌సింగ్‌కు అనుకూలుడైన సీఆర్పీఎఫ్ జవాన్ మాలోతు రవి బయటకు వెళ్లి వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు బానోతు దశరథ్, బానోతు రమేశ్, భూక్య బాలాజీ, విజ య్, ఉమ కలిసి అతడిపై దాడి చేశారు. అడ్డు గా వచ్చిన రవి భార్యను అందరి ముందే వివస్త్రను చేశారు. రవిపై దాడి చేస్తుండటాన్ని గమనించిన అతడి పెద్దనాన్న తేజావత్ ఈర్య అలియాస్ పాప (55) (గ్రామ బీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్) అడ్డుకోగా.. కాంగ్రెస్ కార్యకర్త తేజావత్ దశరథ్ అతడి ఛాతీపై బలంగా కొట్టడంతో అకడికకడే మృతిచెందాడు.
అధికారంలోకి వచ్చీరాగానే కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారు. అకారణంగా జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి, కాసర్లపహాడ్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. అడ్డగోలుగా ఆస్తులు ధ్వంసం చేశారు. తుంగతుర్తిలో ఇప్పటికీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లిలో కూడా కావాలనే కాంగ్రెస్ నేతలు గొడవకు దిగి పెద్ద రాద్దాంతానికి తెరలేపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట రూరల్ మండలంలోని దుబ్బతండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కిరణ్‌పై అదే తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం, గండిపేట్‌లో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భీమ్‌దాస్.. హైమద్, రజాక్, జావేద్ అనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తితో పొడవడంతో గాయపడ్డారు.
నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందడంతో మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోనికాలనీలో బీఆర్ఎస్ సర్పంచ్ వెంకటమ్మ భర్త పెద్ద వెంకన్నపై అకారణంగా దాడిచేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఆంజనేయులు తలకు గాయాలయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగవట్నంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శివ, బాలపీరు, రాముడు కారుపైకి రాళ్లు విసిరి, రాళ్ల దాడికి పాల్పడ్డారు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో పోలింగ్ ముందు రోజు రాత్రి కత్తిపోటుకు గురైన మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు గుజ్జుల పరమేశ్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దేదినేనిపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు మల్లేశ్ (ఎంపీటీసీ భర్త) ఇంటిపై దాడిచేశారు. కురుమ కులానికి చెందిన భార్యాభర్తలను కొట్టడంతోపాటు వాల్మీకి కార్యకర్త ఇంటిపైనున్న ప్లాస్టిక్ కవర్‌కు నిప్పుపెట్టారు. నల్లగొండ మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిలర్ భర్త జేరిపోతుల భాసర్ గౌడ్, తన సోదరులు, కార్యకర్తలు కలిసి మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి ఇంటి ముందు హంగామా చేశారు.
పెద్దపల్లి జిల్లాలో 4 నెలల వ్యవధిలోనే సల్వాజీ మాధవరావుపై 4 సార్లు హత్యాహత్యానికి పాల్పడ్డారు. తనపై కాంగ్రెస్ నాయకులు హత్యా యత్నానికి పాల్పడ్డారని నెత్తుటి మరకలతో పోలీస్ స్టేషన్ మె ట్లు ఎకిన సల్వాజీ మాధవరావుపైనే పో లీసులు ఉల్టా అట్రాసిటీ కేసు నమోదు చే సి జైలు పాలు చేశారు. రాజకీయ ప్రేరేపిత దాడుల్లో బాధితులైన వారిలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్, సూర్యాపేట జిల్లా అర్పనపల్లి మండలం కాసర్లపహాడ్‌కు చెందిన మెండె సురేశ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి చెం దిన చల్లా హరి, దనియాకుల హన్మంతరా వు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం జొన్నలబోగుడకు చెందిన మా జీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు, రాత్లావత్ మంగమ్మ, కార్పొరేటర్ దేదీప్యారావు ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎక్కడో ఓ చోట కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం కనిపిస్తూనే ఉన్నది. నాటి బీఆర్ఎస్ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఎంపీ ఎన్నికల ప్రచారంలోనే కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్త హత్యాయత్నం చేశాడు. త్రుటిలో తప్పించుకున్న ప్రభాకర్‌రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హైడ్రా బాధితుల పక్షాన మాట్లాడేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని కాంగ్రెస్ గూండాలు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి, నల్లగొండలో బీఆర్ఎస్ నేతలు, రైతులు చేస్తున్న ధర్నాపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, ఖమ్మంలో వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే అక్కడ కూడా హరీశ్‌రావు బృం దంపై దాడి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇం టిపై దాడికి తెగబడినా పోలీసులు పట్టన ట్టు వ్యవహరించడంపై విమర్శలున్నాయి.