హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగానే.. పల్లెలకు రేవంత్ సర్కారు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టుగా చెప్తున్నదాంట్లో నిజం లేదనేందుకు ములుగు జిల్లా రామయ్యపల్లె నిదర్శనంగా నిలిచింది. ఈ ఊరిలో 80 రైతు కు టుంబాలు లోన్లు తీసుకుంటే కేవలం 25 కు టుంబాలకే రుణమాఫీ అయింది. 87 మంది రైతుల్లో కేవలం ముగ్గురికే సరిపడా యూరియా అందింది. 19 మంది రైతు కుటుంబాలకు ‘భరోసా’ దక్కలేదు. 79 మంది ఇందిర మ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ముగ్గురికే వచ్చాయి. 16 మహిళా సంఘం గ్రూపులుంటే ఒక్కదానికీ సున్నా వడ్డీ రుణాలు అందలేదు. రూ.500 గ్యాస్ సిలిండర్ అందుతున్న ది కేవలం నాలుగు కుటుంబాలకేనని తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదాంట్లో నిజమెంతో తెలుసుకునేందుకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ఓ సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ దారుణాలు బయటపడ్డాయి.
ములుగు మండలం లక్నవరం అడవుల్లో విసిరేసినట్టుగా రామయ్యపల్లె ఉంటుంది. వంద ఇండ్ల గడప కలిగిన ఈ మారుమూల పల్లెలో గిరిజన తెగల ఆధిపత్యం ఉంటుంది. ఇక్కడివారికి వ్యవసాయమే జీవనాధారం. ఊరిలో ఓ ఔత్సాహిక రైతు.. పేరు డాక్టర్ భూక్యా అమర్‌సింగ్. 16 ఎకరాల ఆసామి. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ఆయన పేరు మీద జంగాలపల్లి యూనియన్ బ్యాంక్‌లో రూ.1.90 లక్షల వ్యవసాయ రుణం ఉన్నది. లక్డోత్ రాజు, బానోతు సమయ్యకు కూడా బ్యాంకు లోన్ ఉన్నది. ముగ్గురూ కలిసి బ్యాం కు చుట్టూ రుణమాఫీ కోసం తిరగని రోజు లేదు. అమర్‌సింగ్ తల్లి భూక్యా రఖిలీ, సోదరుడి భార్య సునీత ఇద్దరూ మహిళా సంఘం సభ్యురాళ్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి సున్నా వడ్డీ రుణాల కోసం తీరుగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు రూపా యి కూడా రుణసాయం అందలేదు.. ఒక్క సునీతా, రఖిలీ మాత్రమే కాదు.. ఆ పల్లెకు చెందిన ప్రతి పొదుపు సంఘం మహిళ జంగాలపల్లి యూనియన్ బ్యాంకు చుట్టూ తిరుతూ నే ఉన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి రూ.2 లక్ష ల లోపు రైతులందరికీ రుణమాఫీ చేశామని, అడిగిందే తడవుగా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నామని పదే పదే ప్రకటిస్తున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన బాధితులతో కలిసి ఓ సామాజిక సంస్థ క్షేత్రస్థాయిలో వాస్త వ పరిస్థితిని అంచనా వేయాలని నిర్ణయించింది. 20 నెలల్లో అందిన సంక్షేమ పథకాల వివరాలు సేకరించాలని సంకల్పించింది. 16 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని రూపొందించి, 10 రోజులపాటు ఇల్లిల్లూ తిరిగి పూర్తి వివరాలు సేకరించింది. సమాచారాన్ని క్రోడీకరించి, వ చ్చిన ఫలితాలను పరిశీలిస్తే ఈ పల్లెలో మళ్లీ పాత రోజులే కనిపించాయి. సమైక్య పాలన నాటి పరిస్థితులు కండ్ల ముందు కదలాడాయి. మూడు సార్లు రైతుభరోసా అందిన రైతు కు టుంబాలు కేవలం రెండంటే రెండే ఉండగా అసలు ఇప్పటి వరకు రైతు భరోసా అందనివి 19 కుటుంబాలున్నట్టు తేలింది. కేసీఆర్ హ యాంలో వందకు వంద కుటుంబాలు.. ఉన్న ఊరులోనే సాగు చేసుకొని జీవనం సాగించగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 14 కుటుంబాలు భూములను కౌలుకిచ్చి వలస పోయినట్టు తేలింది. ఈ సర్వే రిపోర్టును డాక్టర్ అమర్‌సింగ్ ‘నమస్తే తెలంగాణ’కు పంపారు.
కాశీందేవిపల్లి రెవెన్యూ గ్రామానికి రామ య్యపల్లె హామ్లెట్ విలేజ్‌గా ఉంటుంది. 295 హెక్టార్ల భూమి ఉన్నట్టు అంచనా. సరిగ్గా 103 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 76 కుటుంబాలు షెడ్యూల్డ్ తెగల కుటుంబాలు. 27 బీసీ యాదవ, కుర్మ కుటుంబాలు, ఒక్క ఎస్సీ కు టుంబం ఉన్నది. వీరిలో 87 కుటుంబాలకు ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉన్నది. మిగిలిన కుటుంబాలు వ్యవసాయ కూలీ పను లు చేసుకుంటున్నాయి. వ్యవసాయం కాకుం డా గొర్రెల పోషణ కనిపించింది. ఈ గ్రామం లో ఎంత మంది రైతులు లోన్లు తీసుకున్నా రు? ఎంత మందికి రుణమాఫీ అయింది? అని పరిశీలించగా 80 రైతు కుటుంబాలు లోన్లు తీసుకున్నాయి. వీరిలో రూ.2 లక్షల లోపు రుణం ఉన్న రైతులు 54 మంది, ఆ పైన రుణం ఉన్నవారు 26 మంది ఉన్నారు. గ్రామం మొత్తం మీద రైతు రుణమాఫీ అయినవారు కేవలం 25 మందేనని తేలింది. ఇంకా 55 మంది రైతుల రుణాలు జంగాలపల్లి యూ నియన్ బ్యాంకులోనే మూలుగుతున్నాయి.
19 మంది రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు రైతు భరోసా దక్కలేదు. రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటి వరకు మూడుసార్లు రైతు భరో సా వేసినట్టు ప్రకటించింది. అయితే కేవలం రెండు కుటుంబాలకే మూడు సార్లు రైతు భరో సా అందింది. రెండు పర్యాయాలు తీసుకున్న వాళ్లు 55.2%, కేవలం ఒకేసారి తీసుకున్నవాళ్లు 25.3% మాత్రమే ఉన్నట్టు లెక్క తేలింది. 87 మంది రైతుల్లో కేవలం ముగ్గురే క్యూలో నిలబడకుండా నేరుగా యూరియా తెచ్చుకున్నామని చెప్పారు. మిగిలిన 84 మంది రైతులు రోజుల తరబడి చెప్పులు వరుసలో పెట్టి నిలబడి యూరియా తెచ్చుకున్నామని వివరించారు.
103 కుటుంబాలు ఉన్న రామయ్యపల్లిలో 62 కుటుంబాలు గుడిసెల్లోనే నివసిస్తున్నాయి. వీటిలో 18 గడ్డి గుడిసెలు. 44 ఇండ్లు గూనిపెంక లు, రేకుల కొట్టాలు. 79 మంది ఇం దిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురికి మాత్రమే ఇండ్లు మం జూరు చేసింది. అట్లాగే 16 మహిళా సంఘం గ్రూపులు ఉండగా ఒక్క గ్రూప్‌కు కూడా సున్నా వడ్డీ రుణాలు అందలేదు. రూ 500 గ్యాస్ సిలిండర్ రెగ్యులర్‌గా పడుతున్నది కేవలం 4 కుటుంబాలకు మాత్రమే అని తేలిం ది. ఇక 20 నెలల నుంచి ఆరోగ్య శ్రీ పథకం వెసులుబాటును వాడుకున్న కుటుంబం ఒకే ఒక్కటని తేలింది. అదికూడా రూ.5 లక్షల లోపు సౌకర్యమే అందినట్టు స్పష్టమైంది.