కేసీఆర్ సారు మళ్లెప్పుడు వస్తారు?
‘అయ్యా.. కేసీఆర్ సారు మళ్లెప్పుడు వస్తారు? కేసీఆర్ పెంచిన పింఛనే ఇప్పటికీ ఇస్తున్నారు..కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి మోసపోయాం’ అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలతో వృద్ధులు వాపోయారు.
- ఆయన పెంచిన పింఛనే ఇస్తున్నారు
- కాంగ్రెస్ మాటలకు మోసపోయాం
- దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలతో వృద్ధులు
భూత్పూర్, జూన్ 28 : ‘అయ్యా.. కేసీఆర్ సారు మళ్లెప్పుడు వస్తారు? కేసీఆర్ పెంచిన పింఛనే ఇప్పటికీ ఇస్తున్నారు..కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి మోసపోయాం’ అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలతో వృద్ధులు వాపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది వృద్ధులు ఆయన వద్దకు వచ్చి అయ్యా బాగున్నావా.. అని పలుకరించారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల సమయంలో పింఛన్ రూ.4,000, ఆడవాళ్లకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన మాటలకు మోసపోయి కారు పార్టీని దూరం చేసుకున్నామని వాపోయారు. ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నామని చెప్పారు. కాంగ్రెసోళ్లు వచ్చినంక రైతుభరోసా రావడంలేదని, యూరియా దొరుకుతలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల స్పందిస్తూ ..‘మీరేం దిగులు చెందకండి, మళ్లీ వచ్చేది మన పార్టీయే.. కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతారు.. మన పనులను మనం చేసుకుందాం’ అని ధైర్యం చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

