రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది. గొంతు తడుపుకొనేందుకు నట్టెండలో కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆదిలాబాద్ జిలా ఇంద్రవెల్లి మండలం అంద్గూడ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గూడెం గిరిజనులు, ఇలా ఎడ్లబండ్లపై డ్రమ్ములు కట్టుకొని దూరాన ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. గూడెంలో పంపులు, బావులు ఎండిపోవడం, మిషన్ భగీరథ పథకంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో వారికి నీటి గోస తప్పడం లేదు.