e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News తెలంగాణ‌లో ఇక‌ క‌రువులుండ‌వు : సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో ఇక‌ క‌రువులుండ‌వు : సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో ఇక‌ క‌రువులుండ‌వు : సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్ : మారిన ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో ఇక నుంచి క‌రువు ప‌రిస్థితులు ఉండ‌వ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనే పటిష్ట‌మైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌కు సీఎం సూచించారు. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ గురువారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. భారీ వ‌ర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై స‌మావేశంలో సీఎం చ‌ర్చించారు.

అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

భారీ వ‌ర్షాల హెచ్చ‌రికల నేప‌థ్యంలో నీటి పారుదల, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాల‌ని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను త‌ర‌లించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రిజర్వాయర్‌లు, ప్రాజెక్ట్‌ల నుండి నీటిని నెమ్మదిగా వదలాల‌న్నారు. ఏడు, ఎనిమిది మందితో కూడిన ఫ్లడ్ మేనేజ్‌మెంట్ టీమ్ ను శాశ్వ‌తంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. తద్వారా ప్రతి సంవత్సరం వరదల రికార్డ్‌ను పాటించాలన్నారు. పాత రికార్డ్‌ను అనుసరించి ఆయా వరద సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు మూసీ నది వరద గురించి ఆరా తీసిన సీఎం వరద ఉధృతి పెరిగే పరిస్థితి ఉంటే మూసీ లోతట్టులో నివాసం ఉంటున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాల‌ని పేర్కొన్నారు.

అక్ర‌మ నిర్మాణాల‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశం..

- Advertisement -

హైదరాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం వివరించారు. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేప‌ట్టిన‌ ఇండ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

ప్ర‌జ‌లు స్వీయ జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటించాలి..

ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉంద‌ని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజా రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆర్ & బీ శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ బ్రిడ్జీలు, రోడ్ల పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. స్వీయ నియంత్రణ చ‌ర్య‌లు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, చెరువుల వైపు సంచరించకూడదని, వరద ఉధృతిలో వాగులు, వంకలు దాటేందుకు సాహసకృత్యాలకు పాల్పడకుండా ఉండాలని సీఎం ప్రజలకు సూచించారు.

శిక్ష‌ణ పొందిన అధికారుల‌తో టీం ఏర్పాటు..

వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు శిక్షణ పొందిన అధికారులతో కూడిన టీంను శాశ్వత ప్రాతిపదికన తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. జీఏడీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితర ఫ్లడ్ చర్యల్లో పాల్గొనే వ్యవస్థలను సమన్వయం చేసుకోగలిగే అధికారి ఉండాల‌న్నారు. సభ్యుల్లో ఒకరు రిహాబిలిటేషన్ క్యాంప్ లను నిర్వహించడంలో అవగాహన కలిగి ఉండాల‌న్నారు. ఆర్మీ, పోలీస్, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థలను అప్రమత్తం చేసుకోవడానికి ఒక అధికారి, వైద్య శాఖ, ఆర్&బి శాఖ, పంచాయితీ రాజ్ శాఖను సమన్వయం చేసుకోగల అనుభవం ఉన్న అధికారిని నియమించాలని సీఎం పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ‌లో ఇక‌ క‌రువులుండ‌వు : సీఎం కేసీఆర్‌
తెలంగాణ‌లో ఇక‌ క‌రువులుండ‌వు : సీఎం కేసీఆర్‌
తెలంగాణ‌లో ఇక‌ క‌రువులుండ‌వు : సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement