హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): వచ్చే వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. తాగునీటి ఎద్దడిపై శనివారం మిషన్ భగీరథ అధికారులతో సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లలో నీటినిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6,399 అంగన్వాడీ, 7,837 హెల్పర్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు.