హైదరాబాద్, ఆగస్టు16(నమస్తే తెలంగాణ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన బీసీ రిజర్వేషన్లపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. పార్టీపై బహిరంగ విమర్శలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పారు. ఈ విషయంలో తాను ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఆదేశించినట్టు తెలిపారు. ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నారో తొలుత తెలుసుకుంటామని పేర్కొన్నారు. మార్వాడీల అంశంపై మాట్లాడుతూ వారు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని మహేశ్‌కుమార్ తేల్చి చెప్పారు.