CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వాస్తు మార్పులు మొదలైనట్టు సమాచారం. ఇంటీరియర్ డిజైన్‌తోపాటు ఫ ర్నిచర్లో కూడా మార్పులు చేర్పులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే ఆరో అంతస్థులో పనులు ప్రారంభమైనట్టు సమాచారం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి పెద్దగా రావడం లేదని చెప్తున్నారు. ఇంట్లో లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో (సీసీసీ) వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొంటున్నారు. వారం పదిరోజుల్లో సచివాలయంలో పనులు పూర్తి కావొచ్చని చెప్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే సంఖ్యా శాస్త్రం, వాస్తు శాస్ర్తానికి అనుగుణంగా అనేక మార్పు లు చేశారని చర్చ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి 9ని అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారు. అందు కే కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 9కి పెంచారని గుర్తు చేస్తున్నారు. అన్ని వాహనాల నంబర్ ప్లేట్లపై 9 నంబర్ వచ్చేలా చూసుకున్నారని అంటున్నారు. వాస్తవానికి సీఎం తన కార్యాలయాన్ని సచివాలయంలో ని 9వ అంతస్థులోకి మార్చాలని భావించారట. ఈ మేరకు పలుమార్లు వెళ్లి పరిశీలించారని, అయితే సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాదని చెప్పడంతో విరమించుకున్నారని చర్చ సాగుతున్నది.
ఇక నలుపు రంగును సెంటిమెంట్‌గా భావిస్తుంటారని.. అందుకే కాన్వాయ్‌ని ప్రత్యేకంగా నలుపు రంగులోకి మార్పించారని చెప్పుకుంటున్నారు. వాస్తు మార్పులకు అనుగుణంగా ఇప్పటికే సచివాయలంలోకి రాకపోకల మార్గాన్ని కూడా మార్చారని అంటున్నారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పువైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని వినియోగించారు. వాస్తు మార్పుల్లో భాగంగా పశ్చిమం వైపు ఉన్న గేటు ద్వారా లోపలికి వస్తున్నారని, ఈశాన్యం వైపు ఉన్న గేటు ద్వా రా బయటికి వెళ్లిపోతున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి.