‘స్కూళ్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ’ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల స్థితి‘స్కూళ్లు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ’ ఇదీ ప్రైవేట్ స్కూళ్లల్లో పరిస్థితి.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 60.77 లక్షల మంది విద్యార్థులుంటే (Students), అందులో 36.17 లక్షల మంది విద్యార్థులు (దాదాపు 60%) ప్రైవేట్ స్కూళ్లలోనే (Private Schools) చదువుతున్నారు. కానీ, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,407 (28.98%) మాత్రమే. అంటే 28.98% ప్రైవేట్ స్కూళ్లలో 59.53% విద్యార్థులున్నారన్న మాట. రాష్ట్రంలో అన్ని రకాల సర్కారు బడులు 24,997 (63%) ఉండగా (Government Schools).. వీటిలో విద్యార్థుల నమోదు 19.3 లక్షలే. ఇది రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 31.76% మాత్రమే. అంటే 63% ఉన్న సర్కారు బడుల్లో చేరింది 31.76 శాతమే. ఈ ఆందోళనకర విషయాలు పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయ్యాయి. రాష్ట్రంలో పన్నెండు వందలకుపైగా గురుకులాలుండగా, వీటిల్లో 4.43 లక్షల మంది విద్యార్థులు (7.3%) మాత్రమే చదువుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 1,897 సర్కారు బడుల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. ఈ స్కూళ్లలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వీటిలో 32 హైస్కూళ్లు ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని 4,325 సర్కారు బడులు పది మంది లోపు విద్యార్థులతో నడుస్తున్నాయి. వీటిలో ప్రాథమిక బడులే అధికంగా ఉన్నాయి.
పది కంటే తక్కువ మంది విద్యార్థులతో నడుస్తున్న స్కూళ్లు