హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ మండలం ఎనికేపల్లితోపాటు వేములవాడ, యాదగిరిగుట్ట, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయ సమీపంలో అత్యాధునిక వసతులతో గోశాలలను ఏర్పాటు చేసేందుకు వీలుగా సమగ్ర గోసంరక్షణ విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ర్టాల్లో అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించారు.
పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో కూడిన కమిటీ లోతైన అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గో సంరక్షణపై సీఎం మంగళవారం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం ముఖ్య కార్యదర్శులు వీ శేషాద్రి, శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులైన ప్రత్యేక బృందం సభ్యులు సబ్యసాచి ఘోష్, శైలజ రామయ్యర్, రఘునందన్‌రావు పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థలోని ఇంజినీర్లను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్చాలని తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీవీఈఏ) కోరింది. టీజీ జెన్కోలో ట్రా న్స్‌ఫర్ పాలసీని రూపొందించి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేసింది. భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను టీవీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నెహ్రూ, ప్రధాన కార్యదర్శి ఎన్ భాస్కర్ మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు.