హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): . ఆర్థిక సాయంపై సీఎంవో, డిప్యూటీ సీఎం, అధికారులు భిన్నమైన ప్రకటనలు చేశారు. ఇలా ఒక్కొక్కరు భిన్నమైన ప్రకటనలు చేయడంతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వ పెద్దల్లోనే స్పష్టతలేని పథకం అమలు జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం రాజీవ్ యువవికాసం పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఒక్కో నియోజకవర్గంలో4-5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. రూ.6వేల కోట్లతో మొత్తం 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఒక్కొక్కరికి రూ. 50వేల నుంచి రూ.4లక్షల వరకు మంజూరు చేస్తామని వివరించారు. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. పన్నుల వసూలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.
రేవంత్రెడ్డి: రూ.50వేల నుంచి రూ.4లక్షలు
భట్టివిక్రమార్క: రూ.3లక్షలు
ప్రభుత్వ అనుకూల రిపోర్టర్: రూ.5లక్షలు
సీఎం పీఆర్వో: రూ.4లక్షలు