రాష్ట్రంలో మారిన వాతావరణం.. ఒక వైపు ఎండలు, మరోవైపు వడగండ్ల వానలు
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసిం ది. ఈ మేరకు హైదరాబాద్ వాతావర ణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
- వచ్చే ఐదురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
- వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసిం ది. ఈ మేరకు హైదరాబాద్ వాతావర ణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురువగా, ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో నమోదయ్యాయని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగ ర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది.
సాయంత్రం సమయంలో మారిన వాతావరణంతో ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సం గారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసినట్టు తెలిపింది. హైదరాబాద్‌లో ని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసినట్టు వెల్లడించింది. అదేవిధంగా వచ్చే ఐదు రోజులు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా, అకాల వర్షాలకు రైతులు ఆరబెట్టిన వడ్లు, మక్కలు తడిసిపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- hailstorms
- Rains
- Summer
- weather
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

