హైదరాబాద్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఖైరతాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చేదా? అని వక్తలు, సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు. ఆనాడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో కాంగ్రెస్‌కు అనుకూలంగా కథనాలు రాయకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఆద్య టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ‘ఎవరు జర్నలిస్టులు-ఏది జర్నలిజం’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పత్రికలు, టీవీ చానళ్ల సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, క్రాంతి కిరణ్, శైలేష్‌రెడ్డి, మారుతిసాగర్, సరిత, రమణ, యోగి, మ్యాడం మధు తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ మీడియా సహకారం లేకపోతే రేవంత్‌రెడ్డికి సీఎం పదవే వచ్చేది కాదని స్పష్టంచేశారు. సీఎం కుర్చీలో కూర్చోగానే ఆయన గతాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శమని నిప్పులుచెరిగారు. సీఎం కుర్చీలో కూర్చుని ఏదైనా మాట్లాడొచ్చని అనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. విద్యార్హతలు లేకుండా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల్లో ఉన్నప్పుడు జర్నలిస్టుల విద్యార్హతల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హ యాంలో 2004-2014 వరకు జర్నలిస్టులను అణచివేశారని గుర్తుచేశారు. సీఎం సహా నేతలెవరైనా జర్నలిస్టుల గురించి మాట్లాడే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం వంకతుమ్మలో 150 కుటుంబాలు ఉండగా.. 400 జనాభా ఉన్నారు. రాజంపేటలో 20 కుటుంబాలు ఉండగా.. 60 మందికి పైగా ఉన్నారు.
ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో సంత జరుగుతుండటంతో ఉప్పొంగుతున్న వంకతుమ్మ వాగును ఇలా కర్ర సాయంతో తమ వాహనాలను గ్రామస్థులు దాటించారు.