కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీవైపు పరుగులుపెడుతున్నాయి. ప్రాజెక్టులోని ఒక్కో పంపుహౌస్ నుంచి దుంకుతూ ఇప్పటికే 88 కిలోమీటర్ల ఎగువకు చేరుకున్నాయి.
కరీంనగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మల్యాల: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంపుహౌస్ నుంచి దుంకుతూ ఇప్పటికే 88 కిలోమీటర్ల మేరకు ఎగువకు చేరుకున్నాయి. గాయత్రి పంపుహౌస్ నుంచి వరదకాలువ మీదుగా ఎగువన ఉన్న ఎస్సా రెస్పీ వైపు వరద కాలువల ద్వారా జలాలు ఎ దురెక్కుతుంటే.. ఇన్నాళ్లూ విమర్శించిన కాంగ్రెస్ నాయకుల కండ్లు చెమ్మగిల్లుతున్నాయి.
ఎస్సారెస్పీలో ప్రస్తుతం నీళ్లున్నా, వరద కాలు వ పరిధిలోని రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నాడు కేసీఆర్ రూపకల్పన చేసి న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకమే ఇప్పుడు రై తులకు కొండంత అండగా నిలుస్తున్నది. కాళేశ్వరం అన్ని ఆపద కాలాల్లో ప్రత్యామ్నాయం గా ఉపయోగపడుతుందంటూ బీఆర్ఎస్ నేత లు ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్న మాటలకు తాజా ఎత్తిపోతలే నిదర్శంగా నిలుస్తున్నాయి.
ఒకనాడు వరదకు మాత్రమే పరిమితమైన వరద కాలువను కేసీఆర్ దూరదృష్టితో బహుళ ప్రయోజనాల కల్పతరువుగా తీర్చిదిద్దారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో వరదకాలువ తన స్వరూపాన్నే మార్చుకున్నదన్న నిజం ఇప్పుడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద 122 కిలోమీటర్లు ఉన్న వరద కాలువను.. మూడు రిజర్వాయర్లుగా మార్చి, నిండుగర్భిణిలా నీళ్లను తన ఒడిలో దాచుకునేలా చర్యలు తీసుకున్నారు. ఒకవైపు, వరదకాలువ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భజలాలను పెంచుకుంటూ.. మరోవైపు, 34 తూ ముల ద్వారా దాదాపు 80 చెరువులకు నీరందించి, అన్నదాతలకు కల్పతరువుగా వరద కాలువను మార్చిన ఘనత కేసీఆర్‌దే.
నాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదొచ్చినప్పడు నీరు సముద్రం పాలయ్యేది. ఆ జలాల ను వినియోగించుకొని దిగువకు ఇవ్వాలన్న లక్ష్యంతో 1991లో ఆనాటి ప్రధాని పీవీ నర్సింహారావు వరద కాలువకు శంకుస్థాపన చేశారు. 22వేల క్యూసెక్కుల సామర్థ్యంతో, 122 కిలోమీటర్ల పొడవున నిర్మించి, దీనిద్వారా దిగువకు 20 టీంఎసీలను తరలించి, 2.2లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ఆ నాడు నిర్ణయించారు. కానీ, సమైక్య రాష్ట్రంలో ఏనాడూ లక్ష్యం దిశగా అడుగులు వేయలేదు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో కాలువ తవ్వకానికే 19 ఏండ్లు పట్టింది. 1991లో పనులు మొదలుపెడితే 2010లో ప్రారంభానికి నోచుకున్న ది.
నాడు తెలంగాణ ప్రాజెక్టులపై చూపిన వివక్షకు ఈ కాలువే సజీవసాక్ష్యం. వరద కాలువలో వరద నీటిని మాత్రమే వదిలి వేయాలన్నది ఉమ్మడి పాలకుల ఆలోచన. కానీ, కేసీఆర్ అందుకు భిన్నంగా ఆలోచించారు. ఎస్సారెస్పీ ఏడారిగా మారితే కాళేశ్వరం జలాలను అంచలంచెలుగా వరద కాలువపై ఏర్పాటుచేసిన మూడు పంపుహౌస్‌ల ద్వారా ఎస్సారెస్పీ లోకి ఎత్తిపోసేలా పనులు పూర్తిచేశారు. రూ.1,999.56 కోట్లతో చేపట్టిన పునరుజ్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద శంకుస్థాపన చేసి అనతికాలంలోనే పూర్తిచేశా రు.
కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి నీళ్లు ఎత్తిపోసి ఆచరణలో చూపించారు. వరద కాలువ వెంట నాటి సమైక్యపాలనలో ఈ కాలువ పొడవునా 16 తూములు మాత్రమే ఉండేవి. వాటిని అశాస్త్రీయంగా నిర్మించారు. కేసీఆర్ సమూలంగా మార్చేసి 34కు పెంచారు. ఆరు మీటర్ల ఎత్తును 2 నుంచి 4కి తగ్గించారు. డయాను మూడు అడుగులకు పెంచారు.
కాళేశ్వర పనికిరాకుండా పోయిందంటూ విషప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిపించేలా గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వైపు పరుగులు పెడుతున్నా యి. రెండు రోజులుగా ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను నంది పంపుహౌస్ ద్వారా గాయత్రీ పంప్‌హౌస్‌కు, అక్కడినుంచి వరదకాలువ కాలువకు ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంపుహౌస్ నుంచి ఎత్తిపోసిన నీరు, జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంపుహౌస్‌కు చేరుకున్నది. అక్కడినుంచి మూడు పంపుల ద్వారా శుక్రవారం నుంచి ఎ గువకు ఎత్తిపోస్తున్నారు.
ప్రస్తుతం ఈ నీళ్లు రాజేశ్వర్రావుపేట వరకు వెళ్లాయి. ఇక్కడినుంచి ఎగువకు ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి ఎస్సారెస్పీలో ప్రస్తు తం 73 టీఎంసీల నీరున్నది. నిబంధనల ప్రకారం.. ఎస్సారెస్పీలో నీటి నిల్వ 26 టీఎంసీలకు చేరుకునే దాకా వరదకాలువ ద్వారా దిగువకు విడుదల చేయవచ్చు. కానీ, ఇటీవల 16 నుంచి 17వ కిలోమీటర్ మధ్య డ్యామేజీ అయింది. దీనిని పునరుద్ధరించడానికి సమ యం పడుతుందని అధికారులు చెప్తున్నారు.
ఎస్సారెస్పీ నీటిని దిగువకు వరద కాలువ ద్వారా విడుదల చేయలేని పరిస్థితి. ఇదే సమయంలో నీటిని వదలకపోతే లక్షలాది ఎకరా ల్లో పంటలు దెబ్బతినే ప్రమాదమే కాదు, వర ద కాలువ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయే ముప్పు ఏర్పడింది. దీంతో రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఆరంభించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకమే కాంగ్రెస్ సర్కార్‌కు వర ప్రదాయినిగా మారింది.
ఎస్సారెస్పీ నుంచి నీటిని దిగువకు ఇవ్వడానికి ఆస్కారం లేకపోవడంతో గడిచిన రెండు రోజులుగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద ఏర్పాటుచేసిన పంపహౌస్ల ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నంది పంప్‌హౌస్, అక్కడి నుంచి గాయత్రీ పంపుహౌస్‌కు ఎత్తిపోసిన అధికారులు.. ఇక్కడి నుంచి వరదకాలువ ఎగువకు నీటిని పంపిస్తున్నారు. దీంతో ఇప్పటికే నీరు రాంపూర్ పంప్‌హౌస్‌కు చేరుకోవడంతో అక్కడ మూడు మోటర్లు ఆన్‌చేసి, అక్కడి నుంచి రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌కు పంపిస్తున్నారు. వరదకాలువ డ్యామేజీ అయిన 17వ కిలోమీటర్ వరకు ఎల్లంపల్లి జలాలను పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ప్రయోజనమే లేదంటూ విషప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడు అదే దిక్కయ్యింది. అందరి పాలకుల్లా కేసీఆర్ ఆలోచించి ఉంటే.. నేడు ఎల్లంపల్లి నుంచి వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీ వైపు నీటిని ఎత్తిపోసే అవకాశం వచ్చేదా? వరద కాలువ పరీవాహక ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి ఉండేదా? దాదాపు 86 చెరువులు నిండటమే కాకుండా, భూగర్భజలాలు పెరిగేందుకు అవకాశం కలిగేదా? ప్రస్తుతం ఎత్తిపోస్తున్న నీరు ద్వారా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఎత్తిపోతలే లేకుంటే ఈ రైతుల బతుకు ఆగమయ్యేదే కదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి 122 కిలోమీటర్ల పొడవు ఉన్న వరద కాలువను బహుళ ప్రయోజనాలకు వినియోగించవచ్చన్న ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న పునరుజ్జీవ పథకమే ఇప్పుడు రైతులకు వరం అవుతున్నది. గాయత్రీ పంపుహౌస్ నుంచి మొదలుకొని.. 0.10 కిలోమీటర్ ముప్కాల్ వరకు ఏర్పాటుచేసిన పంపుహౌస్‌లన్నీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టినవే. ఉమ్మడి రాష్ట్ర పాలకుల మాదిరిగానే.. ఎల్లంపల్లి నుంచి చేవెళ్ల వరకు మాత్రమే నీటిని ఎత్తిపోయాలని కేసీఆర్ ఆలోచించి ఉంటే.. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వగలిగేదా? అనే ప్రశ్న వ్యక్తమవుతున్నది.