‘బండ్ల’తో అభివృద్ధి బాట
ఉమ్మడి రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గానిది దయనీయ పరిస్థితి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు అభివృద్ధి చెందారు కానీ గద్వాల మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడి నుంచి గెలిచిన డీకే అరుణ మంత్రి పదవి చేపట్టారు కానీ నియోజకవర్గ ప్రగతిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు.
- గద్వాల నుంచి మూడుసార్లు గెలిచిన డీకే అరుణ
- ఆమె హయాంలో వెనుకబడ్డ నియోజకవర్గం
- కేసీఆర్ పాలనలో మంచిరోజులు వచ్చాయి
- కొత్త జిల్లాగా ఏర్పాటు.. నడిగడ్డపై ప్రగతి పరవళ్లు
ఉమ్మడి రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గానిది దయనీయ పరిస్థితి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు అభివృద్ధి చెందారు కానీ గద్వాల మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడి నుంచి గెలిచిన డీకే అరుణ మంత్రి పదవి చేపట్టారు కానీ నియోజకవర్గ ప్రగతిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. రెండు నదుల మధ్య ఉన్న ఈ నడిగడ్డ నేల మీద పంటలు ఎండిన దుస్థితికి కారణం గత పాలకులే.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గద్వాలకు మంచి రోజులు వచ్చాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి వేగం పుంజుకున్నది. గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. రూ.581 కోట్లతో గట్ట్టు ఎత్తిపోతలనుచేపట్టింది. సమృద్ధిగా సాగునీరు అందుతున్నది. అభివృద్ధిలో గద్వాల నెంబర్ వన్‌గా నిలుస్తున్నది.

గద్వాల ఫైల్స్
గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పదేండ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఆమె మంత్రిగా పనిచేశారు. ఆమె భర్త డీకే భరతసింహారెడ్డి సైతం గద్వాలకు ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇరవై ఏండ్ల పాటు ఏలిన డీకే దంపతులు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. అక్కడక్కడ రోడ్లు, రెండు కళాశాలల ఏర్పాటు తప్ప చేసిందేమీలేదు. ఇదే సమయంలో గద్వాలకు సాగునీటిని అందించడంలో ఆమె విఫలమయ్యారనే విమర్శలూ ఉన్నాయి. పైగా కృష్ణానది నుంచి నీటిని అక్రమంగా ఆనాటి ఆంధ్రా ప్రాంతానికి తీసుకెళ్లడాన్ని ఆమె అడ్డుకోలేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో బలంగా ఉన్నది.
రూపురేఖలు మార్చిన కేసీఆర్ సర్కార్
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక గద్వాల అభివృద్ధిబాట పట్టింది.
గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది.
దీంతో నియోజకవర్గ ప్రజలకు పాలన చేరువయ్యింది.
రూ.45 కోట్ల వ్యయంతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, రూ.28 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించింది. ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించడంతో జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణం వేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడి ప్రజలు సుదీర్ఘకాలంగా కోరుతున్న మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతున్నది. 300 పడకల ప్రభుత్వ దవాఖాన వచ్చింది.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన తర్వాత గద్వాల రూపురేఖలే మారిపోయాయి. అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వ విద్య, వైద్యం మెరుగయ్యింది. రూ.581 కోట్లతో ప్రభుత్వం గట్ట్టు ఎత్తిపోతలను చేపట్టింది. నెట్టెంపాడు ద్వారా సమృద్ధిగా సాగునీరు అందుతున్నది. ఇక్కడి రైతన్నలు రెండు పంటలు పండించుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాజాగా ఎన్నికల బరిలో నిలిచారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

