హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ నవంబర్ 6కు వాయిదా పడింది. ఉమ్మడి ఏపీకి కృష్ణాజలాల్లో కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను తెలంగాణ, ఏపీ మధ్య పునఃపంపిణీ చేయడంతోపాటు, ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని కేంద్ర ప్ర భుత్వం గత అక్టోబర్లో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
విచారణనను శుక్రవారం కొనసాగగా ఆపరేషన్ ప్రొటోకాల్ అంశాన్ని మాత్రమే సాక్షు ల ద్వారా విచారించాలని ఏపీ ప్రతిపాదించింది. ఏపీ తరపు సాక్షికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు గడువు కోరింది. తెలంగాణ అభ్యంత రం వ్యక్తం చేయడంతోపాటు ఏపీ అఫిడవిట్లో అంశాలను పరిశీలించాకే అ ఫిడవిట్ దాఖలు చేస్తామని స్పష్టం చే సింది. ఏపీకి నాలుగు వారా ల గడువు ఇస్తూ ట్రిబ్యునల్ విచారణ ను నవంబర్6-8 తేదీలకు వాయిదా వేసింది.