హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా రహదారుల ప్రమాదాల నియంత్రణపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. తొలిదశలో 30 జిల్లాల్లోని 50 పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్ పారులు ఏర్పాటుచేయాలని నిర్ణయించి, తొలి పార్కును నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రారంభించింది.
యూనిసెఫ్ సహకారంతో వీటిని ఏర్పాటుచేయనున్నట్టు, ట్రాఫిక్ అవేర్నెస్ పారుల్లో నేలపై ఫ్లోరింగ్ చేసి జీబ్రా లైన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేసి ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామని జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు.
రహదారి ప్రమాదాల్లో తెలంగాణ టాప్‌టెన్‌లో ఉన్నట్టు రవాణాశాఖ వెల్లడించింది. 2023లో 21,619 ప్రమాదాలు జరగ్గా 7,600 మంది మరణించారు. వీరిలో 1,415 మంది పాతికేళ్లలోపు వారు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేవారే ఎకువగా ఉన్నట్టు రవాణాశాఖ వెల్లడించింది.