కెరమెరి, ఆగస్టు 11 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి గ్రామంలో శనివారం రాత్రి పులి కుక్కలపై దాడిచేసింది. ఓ గుడిసెలో గొలుసులతో శునకాలను కట్టేసి ఉంచగా చంపేసింది. ఒకదాన్ని సగం వరకు తిని వదిలేసి వెళ్లింది. విషయం తెలుసుకున్న కెరమెరి ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ సిబ్బందితో ఆ గ్రామానిక చేరుకొని కుక్కల కళేబరాలు, పులి అడుగులను పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన త ర్వాత పులి దాడి చేసిందో లేదో నిర్ధారిస్తామని తెలిపారు. ఏదిఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.