కొలిక్కిరాని గురుకుల వస్తువుల టెండర్!
గురుకుల, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు సంబంధించి వెల్కమ్ కిట్లు, తదితర వాటికోసం నిర్వహించిన టెండర్లు నెల దాటుతున్నా కొలిక్కిరాలేదు.
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గురుకుల, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు సంబంధించి వెల్కమ్ కిట్లు, తదితర వాటికోసం నిర్వహించిన టెండర్లు నెల దాటుతున్నా కొలిక్కిరాలేదు. ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఏటా పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 24 రకాల వస్తువులను ప్రభుత్వమే అందిస్తున్నది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9 ఐటమ్స్కు టెండర్ల బిడ్ల దాఖలు గడువు ఏప్రిల్ 17వ తేదీతో ముగిసింది. 28 ఏజెన్సీలు బిడ్లను దాఖలు చేయగా, అందులో 14 ఏజెన్సీలు క్వాలిఫై అయ్యాయని నిర్ధారించారు.
ఇక అందులో ప్రధానంగా గుజరాత్ కంపెనీలకే టెండర్లను కట్టబెట్టేందుకు ప్రభుత్వపెద్దలు ముందస్తుగానే లోపాయికారీగా ఒప్పందాలు చేసుకున్నారని, ఆ మేరకు ఏజెన్సీలను సైతం ఖరారు చేసినట్టు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా మే మొదటి వారంలోనే వర్క్ అగ్రిమెంట్లు కూడా పూర్తి చేయాలని సర్కార్ భావించింది. కానీ ఇప్పటికీ టెండర్ల ప్రక్రియే కొలిక్కి రాలేదు. వీటిలో ఏ ఒక్కటి కూడా అర్హత సాధించలేదని రీటెండర్లు నిర్వహించాలని భావిస్తున్నట్టు అధికారవర్గాలు తెలుపుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

