హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఈ నెల చివరి నుంచి ఎండలు మరింత పెరుగుతాయని తెలిపింది.