రెండేండ్ల కాంగ్రెస్ (Congress) పాలనపై విసిగివేసారిన ప్రజానీకం.. హామీలు అమలు చేయని హస్తం పార్టీపై తిరగబడిన పల్లెజనం.. బీఆర్ఎస్ (BRS) బలపర్చిన అభ్యర్థులకు పట్టం కట్టారు. గ్యారెంటీల పేరుతో నమ్మించి నయవంచనకు గురిచేసిన కాంగ్రెస్‌పై… కడుపులో దాచుకున్న ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. పల్లెల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల రణక్షేత్రంలో ఓటు అస్త్రం సంధించి.. విజయకేతనం ఎగురవేశారు. పదేండ్ల పాటు రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తూ… పల్లెలను ప్రగతి పథంలో పయనింపచేసిన గులాబీ దళపతికి జై కొట్టారు. మళ్లీ ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెడుతామంటూ సందేశమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని, అందుకు పంచాయతీ ఎన్నికలే నాంది కావాలని గళమెత్తారు.

సూర్యాపేట జిల్లా చివ్వెంల గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఏర్పుల కల్యాణీనగేశ్ గెలుపు తర్వాత హోరెత్తిన జనసందోహం, వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్లో సర్పంచ్‌గా గెలిచిన బీఆర్ఎస్ బలపర్చిన నాయకురాలు గౌతమి

ఖమ్మం జిల్లా తీర్థాలలో విజయం సాధించిన తర్వాత బీఆర్ఎస్ నేతల సంబురాలు, పెద్దఎత్తున పాల్గొన్న గులాబీ శ్రేణులు

యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలో విజయం సాధించిన తర్వాత గులాల్ చల్లుకుంటూ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి రాఘవేందర్‌రెడ్డి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి అవుదుర్తి రామ్‌కిషన్‌ను సన్మానించిన గ్రామస్థులు, కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జానయ్య గెలుపుతో సంబురాల్లో స్థానికులు

నల్లగొండ జిల్లా రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపుతో గులాబీ రంగులు చల్లుతూ ర్యాలీ నిర్వహిస్తున్న శ్రేణులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తల్లారం గ్రామంలో సర్పంచ్‌గా విజయం సాధించిన తర్వాత ఆనందోత్సాహంలో మునిగిన బీఆర్ఎస్ నాయకురాలు కావలి లక్ష్మీ ప్రసన్న, చిత్రంలో ఆమె భర్త శేఖర్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు

హనుమకొండ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్‌లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి బోడగుంట్ల మానస గెలుపుతో సంబురాల్లో మునిగితేలిన కార్యకర్తలు

సిద్దిపేట జిల్లా నంగునూరు జేపీ తండాలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన మాలోత్ రజిత రమేశ్‌ను అభినందిస్తున్న గులాబీ పార్టీ కార్యకర్తలు

కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందిన పొన్నం సునీతా అనిల్‌గౌడ్‌ను సన్మానిస్తున్న నాయకులు, కార్యకర్తలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్‌లో బీఆర్ఎస్ మద్దతుతో అభ్యర్థి చస్మోద్దీన్ గెలుపుతో సంబురాలు నిర్వహిస్తున్న గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు

నాగర్‌కర్నూల్ జిల్లా మంతటి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన అభ్యర్థిని శ్రీనివాసులును ఎత్తుకుని హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్న గులాబీ శ్రేణులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆముదాలపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన బీఆర్ఎస్ నాయకుడు ఇచ్చింతల విష్ణుకు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎన్నికల అధికారి

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జగదీశ్వరమ్మ గెలుపుతో సంబురాల్లో మునిగిన గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు