బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు జనసామాన్యం తరలిరావడంతో హైదరాబాద్ నందినగర్ వీధులు కిక్కిరిసి పోయాయి. చాలాకాలం తర్వాత ఆయన అభిమానులను కేసీఆర్ నేరుగా కలుసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలుకరించారు. దొడ్ల నర్సింహులు అనే ఉద్యమకారుడు భార్యతో కలిసి వచ్చి తమ పాపకు పేరు పెట్టాలని కోరుతూ కేసీఆర్ చేతిలో పెట్టారు. ‘సుమన్’ అని కేసీఆర్ నామకరణం చేయడంతో వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
