హైదరాబాద్, జనవరి24( నమస్తే తెలంగాణ) : పదవుల కోసం గాంధీభవన్లో తనుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. శుక్రవారం పలువురు నేతలకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. కాగా వలస కాంగ్రెస్ నేతలకు మాత్రమే పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారంటూ కొత్తగూడెం జిల్లాకు చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు గురువారం గాంధీభవన్లో తన్నుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన వారిపై అసలు కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. గొడవకు కారణమైన గడ్డం రాజశేఖర్, బరగాడి సన్ని, సుధీర్ కుమార్, యాదగిరి ప్రదీప్, గుంపుల రవితేజకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.