హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 31 నాటికి లబ్ధిదారుల ఎంపిక, పండ్ల మొక్కలు నాటడం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐదు ఎకరాల లోపు భూమి, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డ్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులను లబ్ధిదారులుగా ఎంపికచేయనున్నారు.
పండ్ల తోటల పెంపకానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇందుకు ఉపాధిహామీ, పీఎంకేఎస్‌వై పథకాలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. డ్రిప్ ఇరిగేషన్‌కు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన శాఖ అధికారులు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు. ఆయా శాఖల పరిధిలోని అంశాలను పరిష్కరిస్తారు. పండ్ల తోటల్లో అంతర్ పంటలు వేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు రెండు రకాలుగా ఆదాయం లభిస్తుంది. సంప్రదాయ పంటలతో ఒక్కోసారి రైతులు నష్టపోతున్నారు. ఒకేరకమైన పంటలు పండించడం వల్ల బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోవడం జరుగుతుంటాయి. వాటన్నింటికి పరిష్కారంగా ఉద్యాన పంటలను సాగు చేయించాలని నిర్ణయించారు.
మార్గదర్శకాలు