మైలార్‌దేవ్‌పల్లి, మే 12: చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తన పౌల్ట్రీ ఫామ్ సిబ్బందితో డబ్బును పంచిపెడుతున్నారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పల్లెచెరువు ప్రాంతంలో పౌల్ట్రీ సిబ్బంది నగదు పంచుతుండగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు ఈ తతంగాన్ని నడిపించారు. నగదు పంపిణీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. నగదు పంచుతున్న వారిలో ఒకరిని ప్రశ్నించగా తనది కాంగ్రెస్ పార్టీ అని, స్థానికంగా డబ్బు పంపిణీ చేసేందుకు పౌల్ట్రీ ఫామ్ నుంచి తీసుకొచ్చి రంజిత్‌రెడ్డికి మద్దతుగా నగదు పంచుతున్నామని చెప్పినట్టు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఓటమి భయంతోనే రంజిత్‌రెడ్డి తన పౌల్ట్రీ ఫామ్ సిబ్బందిని రంగంలోకి దింపి మద్యంతోపాటు నగదు ఆశ చూపి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు.