గంగాధర, జూలై 4: కరీంనగర్ జిల్లా గం గాధర మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ తప్పులతడకగా మారిం ది. ఒక గ్రామ ఓటర్లకు సంబంధించిన గణనఫారాలు మరోగ్రామంలో కనిపించడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది. ఫొటో ఒకరిది, పేరు మరొకరిది రావడంతో ఫారం ఎవరికి ఇవ్వాలో తెలియక బీఎల్వోలు తికమకపడుతున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లి, పూడూర్ గ్రామాలు, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నీలోజిపల్లి, కొదురుపాక గ్రామాల్లోని ఓటర్లకు సంబంధించిన ఫారాలు గంగాధర జీపీకి రావడం విస్తు గొలుపుతున్నది.
ఒక గణనఫారంలో గంగాధర గ్రామానికి చెందిన వ్యక్తి పేరు ఉండగా, అందులో మధురానగర్‌కు చెందిన వ్యక్తి ఫొటో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇతర గ్రామాలు, జిల్లాలకు చెం దిన వారి గణనఫారాలు తమ వద్దకు రావడం తో వారి వివరాలు తెలియక బీఎల్వోలు ఇ బ్బంది పడుతున్నారు. దీంతో ఫారాల పంపి ణీ నిలిచిపోయి కుప్పలుగా పేరుకుపోతున్నా యి. ‘సర్’లో నమోదు చేసుకోకుంటే ఓటు కోల్పోయే ప్రమాదముందని ఓటర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించి పేర్లను సవరించాలని కోరుతున్నారు.