రంగారెడ్డి : జిల్లాలోని షాబాద్ మండలంలో దారుణం జరిగింది. కొడుకును అదుపులో పెట్టడానికి తండ్రి చేసిన ప్రయత్నం వికటించడంతో కన్న కొడుకు తండ్రిని హతమార్చిన విషాద ఘటన షాబాద్ మండలంలోని దామరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోకుల రామయ్య(70) కుమారుడు బోకుల వెంకటయ్య ప్రతిరోజు మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని ఇవాళ తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహించిన కుమారుడు తండ్రి రామయ్య ను కర్రతో కొట్టి చంపివేశాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.