తొర్రూరు/వర్ధన్నపేట, జనవరి 31 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే ఓటు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని 5వ వార్డు, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 3వ వార్డులో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. హామీలు అమలు చేయలేక ప్రజల్లో అభాసుపాలవుతున్న సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించినట్టు తెలిపారు.
ఇందిరమ్మ చీరెల పంపిణీలో రూ.450 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తొర్రూరు మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాటోత్ సుందర్, జ్యోతి, సాయి, భాస్కర్, హుము, యుగేందర్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.