బూర్గంపహాడ్, ఆగస్టు 15 : సారపాక రాజీవ్‌నగర్‌లో కొలువైన శిరిడీ సాయిబాబా మందిరంలో స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన తల్లీకొడుకు నీలిమ, వర్ధన్ వెండి కిరీటాన్ని ఆలయ ధర్మకర్త ఏలూరి విశ్వనాథంకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలు సాయినాథుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దాతలను శాలువాతో సత్కారం చేశారు. ఆలయ పూజారి రాంబాబుశర్మ వారికి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.