హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పునర్వ్యవస్థీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి పుష్పగుచ్చాలు అందించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పునర్వ్యవస్థీకరణ వల్ల పీఆర్ ఇంజినీరింగ్‌శాఖ పనితీరు మెరుగుపడుతుందని, మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. మంత్రులను కలిసిన వారిలో పీఆర్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ఏజీ సంజీవరావు, సీఈ జీ సీతారాములు, ఎస్ఈలు ఎన్ ఆశోక్, సురేశ్‌చంద్ర రెడ్డి, ఈఈలు బీ శ్రీహరి, ముజీబ్, డీఈ పీ చంద్రమౌళి, జేఈ మనీశ్ తదితరులు ఉన్నారు.