హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో రోజురోజుకూ డుమ్మా కొట్టే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేదిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రా రంభించారు.
ఏరోజు విద్యార్థి పాఠశాలకు గైర్హాజరైతే వెంటనే వారి తల్లిదండ్రుల రిజిస్ట్రర్ నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.