యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
కాగా, వేకువ జాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా క్యూలైన్లు నిండిపోయాయి. మాడ వీధులు, క్యూ లైన్లు, శివాలయంలో భక్తులతో నిండి పోయాయి. బస్టాండ్ ప్రాంగణం, వీవీఐపీ పార్కింగ్లు వాహనాలతో రద్దీగా మారింది.