మాగనూర్ : కృష్ణమ్మ వెలవెలబోతున్నది. వేసవి ప్రారంభంలోనే నీటి ప్రవాహం లేక రాళ్లు తేలి కళావిహీనంగా దర్శనమిస్తున్నది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూరు శివారులో కృష్ణానదిలో నీటి జాడలు కనిపించడం లేదు. నది నీటిపై ఆధారపడి ఉన్న ఎత్తిపోతల పథకాల పంపింగ్ నిలిచిపోవడంతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో కొల్పూర్, మందిపల్లి, పుంజనూర్తోపాటు పలు గ్రామాలకు చెందిన 50 మంది రైతులు మంత్రి శ్రీహరికి, అలాగే కర్ణాటకలోని రాయిచూర్ ఎమ్మెల్యే, కలెక్టర్‌ను రెండ్రోజుల కిందట కలిశారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి సాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.