హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): లాగచర్ల గిరిజన రైతులను అక్రమంగా జైలులో నిర్బంధించి, థర్డ్ డిగ్రీలు ప్రయోగించి రేవంత్‌రెడ్డి సర్కారు రాక్షసానందం పొందుతున్నదని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, అంబేదర్ రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించే చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన ఖైరతాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ మహా విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, 35 రోజులుగా లగచర్ల గిరిజన రైతుల అక్రమ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడు తూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ గిరిజన రైతులకు అవసరమైన బెయిల్ రాకుండా అవరోధాలు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో మన్నె కవిత, మన్నె గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విప్లవ్ పాల్గొన్నారు.