హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 80.59% విద్యార్థులు పాసయ్యారు. పరీక్షలు రాసేందుకు 71,685 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వీరిలో 66,732 మంది పరీక్షలు రాయగా.. 53,777 మంది విద్యార్థుల పాసయ్యారు. బాలురు 78.50 శాతం పాస్ కాగా, బాలికలు అత్యధికంగా 83.59 శాతం ఉత్తీర్ణత సాధించారు.
జిల్లాల వారీగా తీసుకొంటే సిద్దిపేట జిల్లా 99.47శాతంతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకోగా, జగిత్యాల 53.69శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఈ నెల 10 నుంచి 18 వరకు ప్రశ్నపత్రాల పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో సైన్స్ విద్యార్థులు అత్యధికంగా ఫెయిలయ్యారు. గత జూన్ 14 నుంచి 22 వరకు పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.