హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) ఫలితాలు ఈ నెల 16న విడుదల కానున్నాయి. గేట్ ద్వారా ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ నిర్వహించగా, 8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గేట్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించడం వల్ల ఎంఎస్, ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు.