హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పోలీస్‌శాఖలో పదోన్నతుల ప్రక్రియ వేగతవంతమైంది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అర్హులైన 160 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు తుది జాబితా సిద్ధమైంది. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) మంగళవారం సమావేశమై ఈ జాబితాను రూపొందించినట్టు సమాచారం.