హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం 20వేల పోలీస్ ఉద్యోగాలకు మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ సీవీ ఆనంద్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని లక్షల మంది పోలీస్ ఉద్యోగ ఆశావహులను తీవ్ర నిరాశకు, అయోమయానికి గురిచేశాయని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ కోసం 19,000 పోస్టులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే, ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపిందని డీజీపీ పేరొనడం విస్మ యం కలిగిస్తున్నదని తెలిపారు.
మాజీ డీజీపీ శివధర్ రెడ్డి ఏకంగా 17,000 పోస్టుల ఆమోదం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నామని చెప్పిన నేపథ్యంలో, ప్రస్తుతం ఈ తగ్గింపు లెకలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారాయన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి గత ప్రభుత్వ హయాంలో 2016, 2018, 2022లలో ప్రతి నోటిఫికేషన్లోనూ 16,000 పోస్టులకు తగ్గకుండా భారీ నోటిఫికేషన్లు విడుదల చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఒక పోలీస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో అప్పు చేసి ఏళ్ల తరబడి నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి 20 వేల పోస్టులతో మెగా పోలీస్ నోటిఫికేషన్ను విడుదల చేయాలని, నోటిఫికేషన్ల జాప్యంతో వయసు కోల్పోయిన అభ్యర్థులకు వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిషరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీఎత్తున ఆందోళన చేపడతామని పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు.