హైదరాబాద్, మార్చి 30 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులంటే భయమని, ఉగాది పండుగ రోజున విద్యార్థులను అరెస్ట్ చేయడమంటే కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. పండుగ రోజునే హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం చేయడం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకుని 400 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. విద్యార్థుల గళాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుగా పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొకడమే కాంగ్రెస్ విధానమా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన యూనివర్సిటీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.