హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో 1వ తేదీనాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒకవేళ ఇది ఏర్పడితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడినట్టు తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.