న్యూఢిల్లీ: ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్), రేటింగ్ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మెడికల్ అసెస్మెంట్, రే టింగ్ బోర్డ్ రూపొందించిన మొత్తం 11 ప్రమాణాలు, 78 పారామితులతో ఒక ముసాయిదాను విడుదల చేసింది.
మెడికల్ కాలేజీలకు రేటింగ్ ఇచ్చే విషయమై జాతీయ నాణ్యత మండలితో ముసాయిదా తయారు చేయించిన ఒక సంవత్సరం తర్వాత తాజా డ్రాఫ్ట్‌ను ఎన్ఎంసీ వెలువరించింది. దీని ప్రకారం అత్యున్నత ప్రమాణాలు కలిగిన జర్నల్స్‌లో ప్రచురితం కావాల్సిన పరిశోధన పత్రాల నిబంధనను తొలగించనున్నారు. వైద్య కళాశాలలు అత్యున్నత ప్రమాణాలు సాధించడం కోసం అవి జవాబుదారీతనం, నిబద్ధతతో పనిచేసేలా చేసేందుకు రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఎన్ఎంసీ అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు.